భారీగా తగ్గిన నోకియా 9 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ఫోన్‌ ధర


హెచ్‌ఎండీ గ్లోబల్‌ తన నోకియా 9 ప్యూర్‌ వ్యూ స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ ధర రూ.49,999 ఉండగా దీన్ని రూ.15వేలు తగ్గించారు. దీంతో ఇప్పుడీ ఫోన్‌ను వినియోగదారులు రూ.34,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం తగ్గించిన ధరకే ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌, నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. కాగా ఈ ఫోన్‌కు ఇప్పటికే ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ను అందించారు.