భద్రాద్రిలో శ్రీరామ పట్టాభీషేకం నిరాడంబరంగా సాగుతోంది. భక్తులు లేకుండా మహాపట్టాభిషేకాన్ని వైదిక పెద్దలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను దేవదాయ కమిషనర్ అనిల్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి సమర్పించారు. నిత్యకళ్యాణమండపంలో రాములోరిని అలంకరణ చేసి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు . కాగా నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి అలంకరణ చేశారు. అటు కరోనా ఎఫెక్ట్‌తో శ్రీ రామ నవమి వేడుకలు పరిమిత సంఖ్యతో ఆలయానికే పరిమితం అయ్యాయి. అతితక్కువ మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఏటా శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించే మిథిలా స్టేడియంలో కాకుండా స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించే బేడా మంటపంలోనే కల్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు లేకుండా రామయ్య కల్యాణం నిర్వ హించడం ఇదే తొలిసారని అర్చకులు తెలిపారు. అటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఏకాంత పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.
నిరాడంబరంగా భద్రాద్రిలో శ్రీరామ మహాపట్టాభీషేకం